Tuesday, June 9, 2015

బహిరంగ మలవిసర్జనపై నినాదములు

                                                  బహిరంగ మలవిసర్జనపై నినాదములు
* * * * * * * * * * * * * * * * * * * * * *


మరుగుదొడ్డి లేదా? - సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు
సెల్లు ఫోను కేంటి తొందర - మరుగుదొడ్డి కట్టు ముందర
ఇంటింటా మరుగు దొడ్డి - ఊరంతా ఆరోగ్యం
మరుగుదొడ్ల వాడకాన్ని పెంచు - బహిరంగ మలవిసర్జన నివారించు
ఇంట్లో మరుగుదొడ్డి - ఆత్మగౌరవ చిహ్నం
మరుగుదొడ్డి వాడండి - ఆరోగ్యం కాపాడండి
బహిరంగ మల విసర్జన - నిలిపి వేద్దాం నిలిపి వేద్దాం
టాయిలెట్లు - ఆరోగ్యానికి తొలి మెట్టు
పారిశుద్యం - సమాజ ప్రగతికి చిహ్నం
ఇంట్లో వుంటే పాయిఖానా - అవసరంలేదు దవాఖానా
కలరు టివి కేంటి తొందర - మరుగు దొడ్డి కట్టు ముందర
మహిళలంతా కదులుదాం - మరుగుదొడ్డి నిర్మిద్దాం
బహిరంగ మలవిసర్జన - సాంఘిక దురాచారం
వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం - ఆరోగ్యానికి సుఖమయ మార్గం
మరుగుదొడ్డి లేదా? - సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు
వ్యక్తిగత మరుగుదొడ్డి - అభివృద్దికి ఆనవాలు
మరుగుదొడ్డి ఉంటే నీఇంట - వ్యాధులు దరిచేరవు నీవెంట
సెల్లు ఫోను కేంటి తొందర - మరుగుదొడ్డి కట్టు ముందర
మరుగుదొడ్డి ఉంటే ప్రతి ఇంట - వ్యాధులు పడవు మీ వెంట
మరుగుదొడ్డి కట్టుకో - బ్రతుకు బాట దిద్దుకో
బహిరంగ మలవిసర్జన - సామాజిక రుగ్మత
మోటారు బండి కేంటి తొందర - మరుగు దొడ్డి కట్టు ముందర

తయారు చేసిన వారు . . . .

పి. వెంకట రత్నం, విస్తరణాధికారి (పం.రాజ్ & గ్రా.) , చింతూరు మండలం .

No comments:

Post a Comment